అందాలు ఆరబోస్తున్న టెంపర్ బ్యూటీ..!!

November 21, 2020 at 6:40 pm

టాలీవుడ్‌లో ఆ ఒక్కడు చిత్రంతో పరిచయమైన మధురిమ ఆ తర్వాత మౌనగారం, సరదాగా కాసేపు, ఆరెంజ్, మహంకాళి, షాడో వంటి సినిమాలో నటించింది. కొంత విరామం తరువాత తిరిగి కొత్తజంట, దోచేయ్ చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మేపించింది. తరువాత ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘టెంపర్‌’ చిత్రంలో ముఖ్యమయిన పాత్రలో నటించింది. తెలుగులో ఇన్ని సినిమాలు చేసిన బెంగాలీ భామ మధురిమ బెనర్జీకి పెద్దగా లక్ కలిసిరాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చేసింది.

సినీ పరిశ్రమలో చాలా మటుకు సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు అందరు.నటీనటులుతో పాటు దర్శక నిర్మాతలు కూడా వాటిని ఫాలో అవుతుంటారు. సినీ ఇండస్ట్రీలో లక్ కలసిరాని వారందరు పేర్లను మార్చుకుని తమ అదృష్టాన్ని మరలా పరీక్షించుకుంటారు. ఈ కోవకే చెందుతుంది ఈ బెంగాలీ భామ నైరా బెనర్జీ కూడా. టాలీవుడ్ లో మధురిమగా పరిచయమయిన ఈ అమ్మడే బాలీవుడ్ లో నైరా బెనర్జీ గా పేరు మార్చుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం బికినీలతో పోజ్లిస్తూ తీసిన ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతుంది. వీటి వల్ల చాన్సులు రాకపోయినా అమ్మడుకి బోల్డన్ని లైకులు, కామెంట్లు వస్తున్నాయి.

అందాలు ఆరబోస్తున్న టెంపర్ బ్యూటీ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts