
కరోనా వైరస్ కారణంగా దేశంలోని ప్రజలు అందరు చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు వహించిన గాని సైలెంట్ గా ఎటాక్ చేస్తూనే ఉంది ఈ కోవిడ్ మహమ్మారి.. ఇప్పుడు మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కూడా వదలలేదు. మెగాస్టార్ కీ ఈ మధ్యనే కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయిన విషయం తెలిసిందే. అయితే చిరంజీవికీ ఎటువంటి కరోనా లక్షణాలు లేవు. ప్రస్తుతం చిరంజీవి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే తన అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత,హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక భావోద్వేగ సందేశాన్ని తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.
అన్నయ్య శ్రీ చిరంజీవి గారు సత్వరమే కోలుకోవాలి – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/AuVupQ0maM
— JanaSena Party (@JanaSenaParty) November 10, 2020
అన్నయ్య లాక్ డౌన్ ప్రకటించిప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా..ప్రతీ ఒక్కరిలో చైతన్యం కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే అన్నయ్య, తన ఆరోగ్యం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో అన్నయ్య కరోనా బారిన పడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా..పరీక్షల్లో మాత్రం పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అన్నయ్య చిరంజీవి త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అని జనసేన పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.