వైరల్ వీడియో : ఈ పిల్లాడి చేసిన పనికి అందరూ ఫిదా..!

November 21, 2020 at 4:53 pm

కరోనా వైరస్ మొదలయ్యినప్పటినుండి ముఖానికి మాస్కు వేసుకోడం అనేది మన దినచర్యలో ఒక భాగం అయిపొయింది. చిన్న పెద్దా తేడా లేకుండా అందరు ఎక్కడికి వెళ్లినా మాస్కు ధరించడం తప్పనిసరి అయ్యింది. కానీ ఇక్కడో చిన్న చిక్కొచ్చి పడింది అందరికి. మాస్కులు వేసుకున్న సమయంలో నచ్చిన వాటిని తినడానికి వీలు అవ్వటం లేదు. మాస్కును తీసి తినడం, తాగడం చెయ్యాల్సి వస్తుంది. ఇది కష్టంగా భావించిన కొంత మంది వినూత్న ఐడియాలతో ముందుకు వస్తున్నారు.

ఈ తరుణంలో ఓ చిన్న వయసుగల పిల్లవాడు తన ఫేస్ కి మాస్కు వేసుకోక మందే తనకు ఇష్టమయిన లాలిపాప్‌ను మాస్కు బయటి నుంచి గుచ్చి నోట్లో పెట్టుకున్నాడు. దీంతో ఇటు మాస్కు, అటు చాక్లెట్‌ను తింటూ ఎంజాయ్‌ చేసేసాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో లతా అనే మహిళ తన ట్విటర్‌లో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు అంతా బుడ్డోడి తెలివితేటల్ని ప్రశంసిస్తున్నారు.

వైరల్ వీడియో : ఈ పిల్లాడి చేసిన పనికి అందరూ ఫిదా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts