
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `శ్యామ్ సింగ రాయ్` ఒకటి. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా.. నిహారిక ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. నానికి ఇది 27వ చిత్రం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఈ చిత్రంలో నానికి జోడీగా సాయి పల్లవి, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం.. కథానుగుణంగా ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉండనుందట. ఇప్పుడు ఆ పాత్రకు గానూ అదితీ రావు హైదారీ, నివేథా థామస్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే వీరిద్దరిలో చిత్ర యూనిట్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది తెలియాల్సి ఉంది. కాగా, గతంలో ఏ సినిమాలో కనిపించని డిఫరెంట్ రోల్ పోషించనున్నారట నాని. ఇక ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్స్ సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. ఈ క్రమంలోనే సినీ లవర్స్ ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.