
ఒక్కప్పుడు హీరోయిన్లు స్లిమ్‌గా ఉంటే చాలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. స్లిమ్‌గా కాకుండా, ఫిట్‌గా ఉండాలని కోరుకుంటున్నారు అందరు. జిమ్ముల్లో గంటలకొద్ది తెగ కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నారు. కిలోలు కొద్ది బరువులు ఎత్తుతూ ఫిజికల్‌గా చాలా స్ట్రాంగ్ అని నిరూపించుకుంటున్నారు టాలీవుడ్ బ్యూటీస్. ప్రస్తుతం మన టాలీవుడ్ బ్యూటీస్ ఫిట్నెస్ ఫ్రీక్స్ అవతారం ఎత్తుతున్నారు. సమంత నుంచి నభానటేశ్ వరకు హీరోయిన్లంతా జిమ్ముల్లో కసరత్తులు చేస్తూ, వెయిట్ లిఫ్టింగులు కూడా చేసేస్తున్నారు. ఇక హీరోయిన్ నభానటేశ్ అయితే ఏకంగా ట్రాక్టర్ టైర్‌తో ఎత్తుతూ ఫిట్నెస్ పెంచుకుంటోంది.
టాలీవుడ్ టాప్ హీరోయిన్లు అందరు ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కూడా వీళ్లు మాత్రం వర్కవుట్లు ఆపకుండా ఇంట్లోనే వ్యాయామాలు చేస్తున్నారు. ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిన సమంత, రకుల్ ప్రీత్ సింగ్ అయితే వర్కవుట్స్‌ని తమ డైలీ రొటీన్లో భాగం చేసుకున్నారు. మన ముద్దు గుమ్మలు కి వర్కవుట్స్ ఎక్కువైనా సరే ఫేస్ గ్లో మాత్రం ఏమాత్రం తగ్గడంలేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.