టిఆర్ఎస్ కే ఓటు వేయండి అంటున్న పోసాని కృష్ణ మురళి..?

November 21, 2020 at 2:05 pm

జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారిపోయిన విషయం తెలిసిందే. అధికార ప్రతిపక్షాలు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక అధికార పార్టీని జిహెచ్ఎంసి ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరోసారి విజయఢంకా మోగించాలి అని భావిస్తుంది. తాజాగా జిహెచ్ఎంసి ఎన్నికల పై స్పందించిన సినీ నటులు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో అందరూ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి అంటూ పోసాని కృష్ణమురళి సూచించారు.

మత సామరస్యం కోసం కెసిఆర్ ఎంతగానో కృషి చేశారు అంటూ చెప్పిన పోసాని.. తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు రాష్ట్రం నుంచి వెళ్లగొడతారు అని ప్రచారం జరిగినప్పటికీ కెసిఆర్ మాత్రం ఆంధ్రా వాళ్ళని కూడా ఆదరించారు అంటూ చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ తర్వాత ఆ రేంజిలో మత కలహాలను తగ్గించిన వ్యక్తి ఒక కేసీఆర్ మాత్రమే అంటూ పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.

టిఆర్ఎస్ కే ఓటు వేయండి అంటున్న పోసాని కృష్ణ మురళి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts