వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన.. రష్యాలో తగ్గని ఉధృతి..!

November 28, 2020 at 5:37 pm

కరోనా వైరస్ వెలుగు లోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు గడిచి పోతున్నప్పటికీ ఇప్పటికీ కొన్ని దేశాలలో కరోనా ఉధృతి మాత్రం ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు. అగ్రరాజ్యాల ను పట్టి పీడిస్తూనే ఉంది కరోనా వైరస్. రష్యా లో అయితే రోజురోజుకూ పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారిపోతుంది. అయితే అక్కడ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు వచ్చినప్పటికీ కూడా కరోనా కొత్త కేసుల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. రోజురోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రతిరోజు 20 వేలకు పైగానే కొత్త కేసులు నమోదు ఉండడం అక్కడి ప్రజలందరినీ తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.

గడచిన 24 గంటల్లో 27 వేల ఒక వంద కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి . ఇలా రోజురోజుకు రష్యాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూనే ఉంది. ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ వైరస్ కేసుల సంఖ్య మాత్రం తగ్గకపోవడం మరింత ఆందోళనకరంగా మారిపోతుంది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన.. రష్యాలో తగ్గని ఉధృతి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts