వరద పోయిన అవస్థలు తప్పడం లేదు.. ఎందుకంటే..?

November 29, 2020 at 2:52 pm

ఇటీవల నివర్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ఎన్నో ప్రాంతాలు వరదల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎన్నో ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు అవస్థలు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇటీవల కడప జిల్లాలో నివర్ తుపాను కారణంగా వచ్చిన భారీ వర్షాలతో 10 కాలనీలు జలదిగ్బంధంలో కి వెళ్ళిపోయింది.

అయితే రెండు దశాబ్దాల నుంచి రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరినప్పుడు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తద్వారా వరదల్లో చిక్కుకొని ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతం వరదలు తొలగిపోయినప్పటికీ అక్కడ మొత్తం పేరుకుపోయిన బురద మాత్రం స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.

వరద పోయిన అవస్థలు తప్పడం లేదు.. ఎందుకంటే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts