విద్యార్థులు సిద్ధంకండి.. ఉచిత పోలీస్ శిక్షణ..?

November 21, 2020 at 5:28 pm

ప్రస్తుతం ఎంతో మంది పేద విద్యార్థుల కలలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ చదువుతూ పోలీస్ అవ్వాలనే కల ఉన్నప్పటికీ ఆర్థిక స్థితి సరిగా లేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది విద్యార్థులకు చేయూత అందించే విధంగా.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా పోలీస్ శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కొన్ని సెలెక్ట్ చేసిన జూనియర్ కళాశాలలో ఈ ఉచిత శిక్షణ ఇప్పటికే ప్రారంభించింది తెలంగాణ ఇంటర్ బోర్డ్.

ఇటీవలే మెదక్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ శిక్షణ ప్రారంభమైంది విద్యార్థులందరూ ఈ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని మెదక్ ఆర్టీవో సాయిరాం ప్రారంభించారు. విద్యార్థులందరూ ఈ ఉచిత పోలీస్ శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు సాయిరాం. కాగా ఈ ఉచిత పోలీస్ శిక్షణ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగ పడే అవకాశం ఉంది.

విద్యార్థులు సిద్ధంకండి.. ఉచిత పోలీస్ శిక్షణ..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts