విజయ్‌ ఆంటోని…థ్రిల్లింగ్‌ జ్వాల!!

November 24, 2020 at 7:13 pm

తమిళ నటుడు విజయ్‌ ఆంటోని బిచ్చగాడు సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతున్న సినిమా జ్వాల. ఈ చిత్రానికి నవీన్‌.యమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా తెలుగులో జ్వాలగా, తమిళ్‌లో అగ్ని శిరగుగళ్‌ పేరుతో తెరకెక్కిస్తున్నారు. శర్వంత్‌రామ్‌ క్రియేషన్స్‌ పతాకంపై, జవ్వాజి రామాంజనేయులు షిరిడిసాయి క్రియేషన్స్‌ పై యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి తెలుగులో నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా యమ్‌. రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ అటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అని, ఉజ్బెకిస్తాన్, కజికిస్తాన్‌ పాటు యూరప్‌లోని పలు దేశాల్లో చిత్రీకరణ జరిగాయని ఆయన తెలిపారు. చివరి మూవీ షెడ్యూల్‌ కోల్‌కత్తాలో జరగనుందని, దీనితో మూవీ చిత్రీకరణ పూర్తవుతుంది. విజయ్‌ ఆంటోని సినిమా కెరీర్‌లోనే దాదాపు 25కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్నమొదటి చిత్రం ఇది ఆయన అన్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీ కి జతగా అక్షరాహాసన్‌ నటిస్తునారు.

విజయ్‌ ఆంటోని…థ్రిల్లింగ్‌ జ్వాల!!
0 votes, 0.00 avg. rating (0% score)