విశాల్, ఆర్య సినిమా టైటిల్ రిలీజ్!!

November 26, 2020 at 6:35 pm

కోలీవుడ్ హీరోస్ విశాల్, ఆర్య కలయికలో ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోన్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఈరోజు విడుదల చేశారు. కరోనా లాక్ డౌన్ అనంతరం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ఎనిమి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో విశాల్ హీరోగా, ఆర్య విలన్‌గా నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మృణాళిని రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం విశాల్ కి 30వ చిత్రం కావడం దీనికి మరో విశేషం.

ఇదివరకు బాల దర్శకత్వంలో విశాల్ , ఆర్య కలిసి అవన్ ఇవన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం తెలుగులో వాడు వీడు పేరుతో రిలీజ్ అయింది. ఆ సినిమా అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా బాగా ఆడింది. దర్శకుడు బాలాకు ఈ చిత్రంతో నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

విశాల్, ఆర్య సినిమా టైటిల్ రిలీజ్!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts