వివాహితను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు..?

November 22, 2020 at 5:57 pm

సెల్ఫీ పిచ్చి ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది అన్న విషయం తెలిసిందే. సెల్ఫీ పిచ్చి కారణంగా ఇప్పటికే ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మధ్యకాలంలో సెల్ఫీ కారణంగా పోతున్న ప్రాణాలు ఎక్కువైపోతున్నాయి. ఇక ఇటీవల ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది కుటుంబ సమస్యల నేపథ్యంలో ఇక్కడ ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. క్రమంలోనే ఓ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. వివాహితను యువకుడు గమనించి మహిళను కాపాడ పోయాడు. కానీ అంతలో సెల్ఫీ వీడియో తీసుకోవాలని భావించిన యువకుడు అలా ప్రయత్నించి చివరికి ప్రాణాలు కోల్పోయిన ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్లోని చిలక చెరువు వద్ద ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవాలని చెరువులో దూకింది. చెరువుగట్టున ఉన్న వినీష్ అభిషేకం అనే యువకులు మద్యం తాగుతూ సదరు మహిళను గమనించారు. మహిళలు కాపాడేందుకు వినీష్ చెరువులో దూకాడు. ఈ క్రమంలోనే సెల్ఫీ వీడియో తీసుకోవాలని ఆశ పుట్టి సెల్ఫీ వీడియో తీసుకుంటూ చివరికి మద్యం మత్తులో ఉండడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివాహితను కాపాడబోయి ప్రాణాలు కోల్పోయిన యువకుడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts