
ప్రభాస్ సినిమాకు వీవీ. వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడా అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తోంది. అయితే ఇక్కడ ప్రభాస్ నటించబోయే సినిమాను వినాయక్ డైరెక్ట్ చేయబోతున్నాడు అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, ప్రభాస్ నటించిన సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించబోతున్నాడు.
ఇంతకీ విషయం ఏంటంటే.. 2005లో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటించిన `ఛత్రపతి` సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇదే చిత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్లో రీమేక్ కానుంది. ఈ చిత్రానికి వినాయక్ దర్శకత్వం వహించనున్నాడు.
పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతిలాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా, శ్రీనివాస్ ను ‘అల్లుడు శీను’తో తెలుగులోకి పరిచయం చేసింది కూడా వినాయకే. ఆ చిత్రం మంచి విజయాన్ని కూడా అందించింది. ఇక ఇప్పుడు వినాయక్ దర్శకత్వంలోనే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. ఇక త్వరలోనే దీనిపై ప్రకటన రానున్నట్టు సమాచారం.