హైదరాబాద్‌ చేరుకున్న కేజీఎఫ్ హీరో!!

November 26, 2020 at 6:24 pm

కన్నడ హీరో యశ్ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్యాన్‌ ఇండియా మూవీ కేజీఎఫ్‌ ఛాప్టర్‌-2 . ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే తిరిగి పునః ప్రారంభమైంది. ఈ సినిమా చివరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీలో షెడ్యూల్ చెయ్యగా దీని కోసం ఫిలిం సిటీలో భారీ సెట్ కూడా వేశారు.

ఈ నేపథ్యంలో గురువారం నాడు హీరో యశ్‌ బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు విమానంలో చేరుకున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో హీరో యశ్ ‌మీడియా కంటికి చిక్కారు. ఈ పిక్ లో యశ్ ఆరంజ్ టీ షర్టు, మాస్కు ధరించి అదిరిపోయాడు. 2018లో రిలీజ్ అయిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 1 ఊహించని విధంగా విజయం సాధించి, రికార్డులు సృష్టించిన విషయం అందరికి తెలిసిందే. రాకీ భాయ్‌గా హీరో యశ్‌ అవతారమెత్తి మంచి క్రేజ్ సంపాదించాడు.

హైదరాబాద్‌ చేరుకున్న కేజీఎఫ్ హీరో!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts