వైరల్ వీడియో : ఈ యువకుడు చేసిన సాహసానికి అందరూ ఫిదా..!

November 27, 2020 at 3:30 pm

కొత్తగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టారు. ప్రస్తుతం నిరసన రెండురోజుకి చేరుకొని, దీనిలో భాగంగా ఓ యువ నిరసనకారుడు పోలీస శాఖ వారిని అడ్డుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోలో నిరసనకారుడు పోలీసుల వాహనంపై దూకి, రైతులను తరిమికోటేందుకు పోలీసులు వాడే వాటర్‌ కేనన్లను అడ్డుకున్నాడు. ​పంజాబ్‌లో బంద్ విజయవంతంగా కొనసాగింది.

మూడు బిల్లుల ఆధారంగా చట్టాలు వర్తించవని నిర్ధారించడానికి పంజాబ్ మొత్తాన్ని వ్యవసాయ ఉత్పత్తుల కోసం ‘ప్రధాన మార్కెట్ యార్డ్’గా ప్రకటించాలని శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ డిమాండ్ చేశారు. పక్కనే ఉన్న హర్యాణాలో, రైతులు కర్నాల్ మీరట్, రోహ్తక్ జాజ్జర్, ఢిల్లీ హిసార్, ఇతర రహదారులనురైతులు అడ్డుకున్నారు. దేశ రాజధానిలోనికి వెళ్లడానికి ప్రయత్నించగా ఢిల్లీ ఉత్తరప్రదేశ దగ్గర వందల రైతులను ఆపేశారు. దీంతో నోయిడా ఘజియాబాద్లలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.దేనితో రైతులపై పోలీసులు వాటర్‌కెనన్లు ఉపయోగించారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేసేది లేదంటూ పంజాబ్‌ రైతులు ఢిల్లీ నుంచి ఒక అడుగు కూడా కదపం అని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేవారుకూ ఈ నిరసన ఇలానే కొనసాగుతుందని చెబుతున్నారు రైతులు.

వైరల్ వీడియో : ఈ యువకుడు చేసిన సాహసానికి అందరూ ఫిదా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts