పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

November 18, 2020 at 5:30 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్య‌క్ర‌మం ఏదో ఒక కార‌ణం చేత‌ వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ దృఢ సంకల్పం. ఈ క్ర‌మంలోనే పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ముహుర్తాల్ని డిసైడ్ చేస్తున్నారు. కానీ, ఒకటి తర్వాత ఒకటిగా పెడుతున్న ముహుర్తాలు వాయిదాలు పడుతూనే ఉన్నాయి.

అయితే దాదాపు ఐదారు నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రక్రియకు మరో సారి జగన్ ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది. దీనిపై తాజాగా సీఎం జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న కూడా చేశారు. కోర్టు స్టే వున్న ప్రాంతాలను మినహాయించి, ఇతర చోట్ల డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయా జిల్లా కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు.

దీంతో డిసెంబర్‌ 25న అర్హులకు డి-ఫామ్‌ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,68,281 మంది లబ్ధిదారులకు పట్టాలు అందించడంతో పాటు అదే రోజు ఇళ్ల నిర్మాణాలు మెదలుకానున్నాయి. దాదాపు 15 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. మ‌రి ఈసారి ఫిక్స్ చేసిన డేట్ అయినా వాయిదా ప‌డ‌కుండా స‌క్ర‌మంగా జ‌రుగుతుందా.. లేదా అన్న‌ది చూడాలి.

పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై జ‌గ‌న్ కీల‌క ప్ర‌క‌ట‌న‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts