
గత మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠగా సాగిన అగ్రరాజ్యం అమెరికా ఎన్నిక ఫలితాలు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో ట్రంప్‌పై డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ 290 ఎలక్టోరల్ ఓట్లు సాధించి విజయకేతనం ఎగరవేశారు. అలాగే ఈసారి ఎన్నికల్లో అనూహ్యంగా ఉపాధ్యక్ష రేసులోకి దూసుకొచ్చిన కమలా హారిస్ విజయం సాధించి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు
అమెరికా రాజకీయ చరిత్రలోనే ఇప్పటి వరకు ఏ మహిళ ప్రెసిడెంట్, వైఎస్ ప్రెడిసెండ్ పీఠాన్ని అధిష్టించలేదు. అయితే ఆ చరిత్రను తిరగరాస్తూ.. అమెరికా మొదటి మహిళ, నల్లజాతీయురాలు, ఇండియన్-అమెరికన్, ఆసియన్-అమెరికన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోబడి కమలా రికార్డు సృస్టించింది. ఈ క్రమంలోనే ఆమెకు పలువురు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కమలాహారిస్‌కు వెరైటీగా అభినందనలు తెలిపారు. `డెమొక్రాట్స్ లేదా రిపబ్లికన్లు అన్న రాజకీయాలు పక్కనపెడితే.. భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారీస్ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక అవ్వడం మాకు ఆనందంగా, గర్వంగా ఉంది. కంగ్రాట్స్. దేవుడి ఆశీర్వాదాలు మీకు ఉంటాయని ఆశిస్తున్నా` అని జగన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.