చెర్రీ నో చెప్పిన కథకు ఓకే చెప్పిన మహేష్‌ ..!!

December 4, 2020 at 6:43 pm

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సర్కారు వారి పాట చిత్రం షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇందులో మహానటి ఫేం కీర్తి సురేష్‌ తొలిసారి మహేష్‌తో జత కడుతున్నారు. గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై అందరికి భారీ అంచానాలు నెలకొన్నాయి. తాజాగా సినీ ఇండస్ట్రీలో మహేష్‌కు సంబంధించిన ఓ వార్త బాగా వినిపిస్తోంది. సర్కారు వారి పాట చిత్రం తరువాత మహేష్‌ మరో సినిమాకు పచ్చ జెండా తెలిపినట్లు వార్త.

దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల ఓ కొత్త కథతో రామ్‌ చరణ్‌ను కలిసారట. అయితే చెర్రీ కి తన పాత్ర నచ్చకపోవడంతో ‌ ఈ మూవీకి నో చెప్పాడట. దీంతో వెంటనే వెంకీ సూపర్‌ స్టార్‌ మహేష్‌కు కథ వినిపించినట్లు సమాచారం. ఈ కథ విన్న మహేష్‌ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.

చెర్రీ నో చెప్పిన కథకు ఓకే చెప్పిన మహేష్‌ ..!!
0 votes, 0.00 avg. rating (0% score)