1000 పరుగుల కోసం ఎదురు చూస్తున్న అంటున్న గవాస్కర్..?

December 3, 2020 at 3:39 pm

ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడో వన్డేలో 63 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు కేవలం 251 మ్యాచ్లోనే 12 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నెంబర్వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.

ఈ క్రమంలోనే ఇటీవల దీనిపై స్పందించిన భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ కోహ్లీ ఆటతీరును మెచ్చుకున్నాడు. 251 మ్యాచులలో 43 శతకాలు 60 అర్ద శతకాలు బాదడం అంటే మామూలు విషయం కాదని ఈ లెక్కన చూసుకుంటే వంద సార్లకు పైగానే కోహ్లీ ఆట గురించి మనం గొప్పగా చెప్పుకుని ఉంటాం అంటూ తెలిపాడు. కోహ్లీ నుంచి మరో 1000 పరుగుల కోసం ఎదురు చూడాలి అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

1000 పరుగుల కోసం ఎదురు చూస్తున్న అంటున్న గవాస్కర్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts