ఆచార్య ఊరి సెట్ కు అయిన ఖర్చు ఎంతో తెలుసా…!?

December 3, 2020 at 3:35 pm

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా చాలా ఆలస్యం అయిన ఈ చిత్రాన్ని ఇక ఆలస్యం చెయ్యకూడదని తొందరగా పూర్తి చేయాలని చిరు ఇంకా చిత్రం యూనిట్ ఆలోచన. ఈ సినిమా కోసం ఇటీవల ఓ గ్రామం సెట్ వేశారట. దానికి దాదాపు రూ.20 కోట్లు ఖర్చు అయిందని వినికిడి. మొదటగా ఓ గుడి సెట్‌ను వేశారు, దానికి రూ.4 కోట్లు ఖర్చు అయ్యాయట. అక్కడ కొన్ని ముఖ్య మైన సన్నివేశాలను చిత్ర యూనిట్ రూపొందించింది.

అయితే ఇప్పుడు కేరళాలోని ఒక గ్రామం సెట్‌ను హైదరాబాద్‌లో వేశారు. దాంతో రెండు కలుపుకొని వారికి అయిన ఖర్చు రూ.20 కోట్లు. ఈ గ్రామం సెట్ 16ఎకరాల విస్తీర్ణంతో వేసారంట. ఈ సెట్‌కు కావలసిన అన్ని దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈచిత్రం షూటింగ్ వచ్చే ఏడాది జనవరీలో తిరిగి మొదలు కానుంది. ఇప్పటికె దర్శకుడు కొరటాల శివ దాదాపు 40శాతం షూటింగ్‌ను పూర్తి చేశారు.

ఆచార్య ఊరి సెట్ కు అయిన ఖర్చు ఎంతో తెలుసా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts