త‌ల్లి కాబోతున్న బిగ్‌బాస్ ఫేమ్ హ‌రితేజ‌.. వీడియో వైర‌ల్‌!

December 5, 2020 at 11:05 am

యాంక‌ర్, న‌టి హ‌రితేజ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టీవీ సీరియల్ నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ 2007 నుండే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. మ‌రోవైపు యాంక‌ర్‌గా కూడా ప‌లు ప్రోగ్రామ్స్ చేస్తూ వ‌చ్చింది. ఇక ఎప్పుడైతే హ‌రితేజ‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లో పాల్గొందో.. అప్ప‌టి నుంచి ఈ అమ్మ‌డు క్రేజ్ అమాంతం పెరిగింది.

హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత నటిగా, యాంకర్ గా ఆమెకి ఛాన్స్ లు పెరిగాయి. ప్రస్తుతం హరితేజ సినిమాల్లో నటిస్తూనే.. పలు టీవీ షోలకు యాంకరింగ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. హ‌రితేజ త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా హ‌రితేజ‌నే సోష‌ల్ మీడియాలో ఓ వీడియో రూపంలో వెల్ల‌డించింది.

తాను త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నానని.. తనకు ఎంతో ఆనందంగా ఉందని వీడియోలో తెలిపింది. ప్ర‌స్తుతం హ‌రితేజ పోస్ట్ చేసిన వీడియో నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక హ‌రితేజ గుడ్‌న్యూస్ చెప్ప‌డంతో.. నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

త‌ల్లి కాబోతున్న బిగ్‌బాస్ ఫేమ్ హ‌రితేజ‌.. వీడియో వైర‌ల్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts