వాహనదారులకు బ్యాడ్ న్యూస్…!?

December 5, 2020 at 3:19 pm

వాహనదారులు అందరికి మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి షాక్ ఇచ్చాయి.. దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.77 .78కి చేరుకోగా డీజిల్ ధర రూ.69.32కు చేరుకుంది. ఇక ముంబ‌యి, చెన్నై, బెంగుళూరు వంటి న‌గ‌రాల్లో పెట్రోలు ధ‌ర రూ.80కి చేరింది. హైద‌రాబాద్‌లో చాలా రోజుల నుంచి రూ.80 నుండి పెట్రోల్ ధ‌ర దిగిరావటం లేదు. డీజిల్ ధ‌ర అయితే 14 నుంచి 25 పైస‌లు పెరిగింది. అంత‌ర్జాతీయంగా ముడిచ‌మురు ధ‌ర‌లు పెరిగిన కార‌ణంగానే దేశంలో చ‌మురు కంపెనీలు ఇంధ‌న ధ‌ర‌ల‌ను ఇలా అమాంతం పెంచేసాయి.

ఇకపోతే కోలకత్తాలో పెట్రోల్ ధర రూ.80.83 ఉంది. డీజిల్ ధర రూ.73.27గా ఉంది. ముంబయి నగరంలో లీటరు పెట్రోల్ ధర రూ. 85.20 డీజిల్ ధర రూ.73.59కు చేరుకుంది.చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.80.80కి డీజిల్ ధర రూ.73.23 చేరుకున్నాయి. బెంగుళూరు లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.30, డీజిల్ ధర రూ.71.54 కి చేరుకుంది. ఇక హైద‌రాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.46కు, డీజిల్ ధర రూ.75.40 కి చేరింది.

వాహనదారులకు బ్యాడ్ న్యూస్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts