అల్లు అర్జున్‌కు నో చెప్పిన జబర్దస్త్ భామ..!!

December 5, 2020 at 5:51 pm

తెలుగులో ప్రముఖ ఫిమేల్ యాంకర్‌గా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అనసూయ భరద్వాజ్‌. వచ్చిన ప్రతి అవకాశం చేజిక్కించుకుంటూ వెండితెరపై కూడా అప్పుడప్పుడు తళుక్కుమంటున్నారు. చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తూ తన నటనతో ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఇక రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా చేసిన అనసూయ పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది. మొదటి నుండి సినిమా ఎంపిక విషయంలో అనసూయ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ కృష్ణవంశీ తెరకెకిస్తున్న రంగ మార్తాండ చిత్రంలో ఒక కీలక పాత్రలో చేస్తున్నారు. అలాగే రవితేజ హీరోగా రానున్న కిలాడి చిత్రంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఈ జబర్దస్త్ భామకి మరో సినిమా ఆఫర్‌ వచ్చినట్లు సమాచారం. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్‌ సుకుమార్‌ రూపొందుతున్న పుష్ప చిత్రంలో ఓ ముఖ్యమయిన పాత్ర కోసం అనసూయను సినీ యూనిట్‌ సంప్రదించినట్లు సమాచారం. కాని ఈ ఆఫర్ కి అనసూయ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో డిగ్లామర్‌ పాత్ర కోసం అనసూయను సంప్రదించినట్లు, మేకప్‌ లేకుండా నటించడం ఆమెకు ఇష్టం లేక ఈ ఆఫర్‌ రిజెక్ట్ చేసినట్టు టాక్‌.

అల్లు అర్జున్‌కు నో చెప్పిన జబర్దస్త్ భామ..!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts