కరోనా బారిన పడిన మరో బాలీవుడ్ నటుడు…!?

December 2, 2020 at 10:47 am

గడిచిన పది నెలల కాలంలో దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి కూడా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య నమోదు అవుతున్నాయి. ఇప్పటికే కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ బారినపడ్డారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు, గురుదాస్ బీజేపీ ఎంపీ అయినా సన్నీ డియోల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

గత కొన్ని రోజులుగా సన్నీడియోల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో ఉంటున్నాడు. ఈ తరుణంలో కరోనా పరీక్షలు నిర్వహించగా ఆధునికీకరణ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది అని హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శి అమితాబ్‌ అవస్థీ తెలియజేశారు. ఎంపీ సన్నీడియోల్, అతని స్నేహితులు కలిసి ముంబైకి వెళ్తున్న తరుణంలో సన్నీ డియోల్ కరోనా వైరస్ టెస్ట్ చేసుకోగా అతనికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం అతనికి కరోనా చికిత్స అందజేస్తున్నారు.

కరోనా బారిన పడిన మరో బాలీవుడ్ నటుడు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts