
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది బలి అవుతున్నారు. కరోనా వల్ల కొంతమంది ఆర్ధిక ఇబ్బందులు పాలయ్యారు. ఈ ఇబ్బందులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది.తాజాగా ఇప్పుడు మరో యువ రచయిత కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోయారు . కరోనా వైరస్ కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈయన ఉరి తీసుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక, ఏం చేయాలో అర్ధం కాక చివరికి ప్రాణాలు వదిలారు.
ప్రముఖ హిందీ టీవీ సీరియల్స్‌కి రచయిత గా పనిచేసిన అభిషేక్ మక్వానా ముంబైలోని తన ఇంటిలోనే ఉరి వేసుకుని చనిపోవటం ఇప్పుడు సంచలనం రేపింది. ఆర్థిక సమస్యల వల్లనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సూసైడ్ నోట్లో తెలిపాడు. ఆయన మృతికి బాలీవుడ్ సీరియల్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.