ఏపీ అసెంబ్లీ గందరగోళం.. కొనసాగుతున్న మాటల యుద్ధం..?

December 1, 2020 at 4:55 pm

ఇటీవలే ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టేలా ప్రస్తుతం ప్రతిపక్ష టిడిపి పార్టీ ఎన్నో రకాల ప్రశ్నోత్తరాలను సిద్ధం చేసుకుని అధికార పార్టీపై సంధిస్తోంది. అదే సమయంలో నిరసనలు సస్పెన్షన్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొత్తం హాట్ హాట్ గా సాగుతోంది.

ఇక నేడు అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా స్పీకర్ తమ్మినేని సీతారాం టిడిపి అధినేత చంద్రబాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు పై మొదలైన రగడ అంతకంతకూ తీవ్ర మాటల యుద్ధం గా మారిపోయింది. అధికార పక్ష సభ్యులు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవడంతో ప్రస్తుతం అధికార పక్షం తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే చంద్రబాబు బెదిరింపులకు భయపడేవాడిని కాదు అంటూ అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ అసెంబ్లీ గందరగోళం.. కొనసాగుతున్న మాటల యుద్ధం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts