
వైఎస్సార్ చేయూత, ఆసరా మహిళలకు పశువుల యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దీంతో పాటు అమూల్ కార్యక్రమాలని కూడా ఆయన ప్రారంభించారు. దీనితో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పశువుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, అమూల్‌తో ఒప్పందం కుదిర్చాకా పాడి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.
మార్కెట్లో పోట ఉంటేనే రైతులకు లబ్ది జరుగుతుందని ఆయన అన్నారు. అమూల్‌తో ఒప్పందం కుదరడంతో పాడిరైతులకు లీటర్‌కు రూ.5 నుంచి రూ.7 వరకు లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. అమూల్‌కు వచ్చే లాభాల్లో రెండుసార్లు బోనస్ రూపంలో ఏడాదికి మహిళలకే ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ పేరుఖొన్నారు. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లోని 400 గ్రామాల్లో పాలను విక్రయించిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి నగదును పంపిణీ చేస్తారు. ఎన్నికల టైములో పశుపోషకులకు ఇచ్చిన హామీలను అమలు పరచడంలో భాగంగా పాలసేకరణ, మార్కెటింగ్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన అమూల్‌తో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.