జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించ‌ని షాక్.. ఏకంగా రూ.100 కోట్ల జరిమానా!

December 1, 2020 at 10:23 am

తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి తాజాగా ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మైనింగ్ అధికారులు జేసీ దివాక‌ర్ రెడ్డికి అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఏకంగా రూ.100 కోట్లు జ‌రిమానా వేసి.. దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చాడు.

త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో జేసీ అక్రమాలకు పాల్పడినట్లు మైనింగ్ అధికారులు గుర్తించారు. అలాగే అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి.. 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగిందని, విలువైన లైమ్ స్టోన్‌ను తవ్వి విక్రయించినట్లు త‌నిఖీల్లో తేలింది.

ఈ క్ర‌మంలోనే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ మైనింగ్ అధికారులు జేసీకి భారీ జ‌రిమానా వేశారు. ఒక వేళ ఈ జ‌రిమానా క‌ట్ట‌క‌పోతే.. ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తు చేస్తామని అధికారులు వెల్ల‌డించారు.

జేసీ దివాకర్‌రెడ్డికి ఊహించ‌ని షాక్.. ఏకంగా రూ.100 కోట్ల జరిమానా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts