విశాఖలో దారుణం మహిళ వాలెంటర్ పై దాడి…!?

December 2, 2020 at 4:36 pm

మన దేశంలో మహిళలపై దాడులు, దారుణాలు రోజు రోజుకి పెరిగి పోతున్నాయి తప్పా ఆగడం లేదు. తాజాగా విశాఖలో మాహిళ పై మరో దారుణం చోటు చేసుకుంది. స్థానిక థాంసన్‌ స్ట్రీట్‌ వద్ద ఓ మహిళ పై శ్రీకాంత్‌ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బాధిత యువతి సచివాలయంలో వాలంటీర్‌గా పని చేస్తోంది. ఆ యువతి ఇంట్లో ఒంటరిగా ఉన్న టైములో నిందితుడు దాడికి పాల్పడ్డాడు. అయితే యువతిపై దాడి చేసిన అనంతరం శ్రీకాంత్‌ కూడా గాయపరుచుకున్నాడు.

ఇది గమనించిన అక్కడి స్థానికులు గాయపడిన యువతి, యువకుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ ప్రేమించానంటూ ‌ ఆ యువతిని వేధిస్తూ, చివరికి పెళ్లికి అంగీకరించలేదని దాడి చేశాడని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసుల విచారణలో మర్రిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. బాధితురాలు, శ్రీకాంత్‌ గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వారిద్దరూ కలిసి ఉన్న పిక్స్ కొన్ని ఫేస్‌బుక్‌లో ఉన్నాయి. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స పొందుతుంది, ఆమె పరిస్థితి కాస్త విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

విశాఖలో దారుణం మహిళ వాలెంటర్ పై దాడి…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts