పబ్ జి ప్రియులకు చేదు వార్త…!?

December 1, 2020 at 3:20 pm

పబ్‌జీ లవర్స్ కి మరో పెద్ద షాక్ తగిలింది. ఇకమీదట ఇండియాలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్స్ ఈరోజు నుంచి పని చేయవు. ఈ గేమ్స్‌ని ఎప్పుడో బ్యాన్ చేశారు కదా అన్న అనుమానం రావొచ్చు అందరికి . కానీ ఈ బ్యాన్ కన్నా ముందే యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారు గేమ్‌ను ఆడే సౌలభ్యం ఉండేది ఇన్నాళ్లూ. అక్టోబర్ 30 నుంచి పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ గేమ్ అందుబాటులో ఉండదని పబ్‌జీ అధికారికంగా ప్రకటించింది.

అంటే ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నవారు కూడా ఇకమీదట ఈ గేమ్ ఆడలేరు అన్నమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈరోజు నుంచి ఇండియాలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్ ఏ రకంగానూ పని చేయవు. యూజర్ల డేటా, సెక్యూరిటీ నిబంధనల కారణంగా భారత ప్రభుత్వం మొత్తం 118 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి మనకు తెలిసిందే. వాటిలో పబ్‌జీ మొబైల్, పబ్‌జీ మొబైల్ లైట్ యాప్స్‌తో పాటు టిక్ టాక్, వీచాట్, క్యామ్ స్కానర్ వంటి పలు పాపులర్ యాప్స్ ఉన్నాయి.

పబ్ జి ప్రియులకు చేదు వార్త…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts