
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో `బిబి3` వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. తాజా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
లాక్‌డౌన్‌కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ఇప్పటివరకు ప్రధాన తారాగణం ఎంపిక పూర్తికాకపోవడం దర్శక, నిర్మాతలు అసహనంలో ఉన్నట్టు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. వాస్తవానికి మొన్నటి వరకు ఈ చిత్రంలో బాలయ్య జోడీ ఎవరనే దానిపై అనేక వార్తలు వచ్చాయి. అయితే చివరకు సయేషా సైగల్ పేరు చిత్ర యూనిట్ ప్రకటించగా.. ఆమె కూడా తప్పుకోవడంతో ప్రగ్యా జైస్వాల్ వచ్చింది.
మరో హీరోయిన్గా పూర్ణ ఎంపిక అయింది. కానీ, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రంలో బాలయ్యతో తలపడే విలన్ ఎవరనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సంజయ్ దత్, సోనూ సూద్ వంటి వారిని సంప్రదించగా.. వారు నో చెప్పినట్టు టాక్. ఈ క్రమంలోనే విలన్ పాత్రధారి ఎంపిక పూర్తి కాకపోవడంతో బోయపాటి తలపట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి బాలయ్య-బోయపాటి సినిమాకు హీరోయిన్, విలన్ కష్టాలు ఎప్పుడు వీడతాయో చూడాలి.