ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాలకృష్ణ సినిమా.. ‘బలరామయ్య బరిలో దిగితే..`!

December 5, 2020 at 10:36 am

నంద‌మూరి బాలకృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటితో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బిబి3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. బాలయ్య కెరీర్‌లో 106వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మిస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్నారు. లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రిగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం త‌ర్వాత బాల‌కృష్ణ రామ్‌తో కందిరీగ, ఎన్టీఆర్‌తో ర‌భ‌స చిత్రాలు చేసి.. ప్ర‌స్తుతం `అల్లుడు అదుర్స్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్‌తో ఓ మాస్ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చార‌ట‌.

బాల‌య్య ఇమేజ్‌కు తగ్గట్లుగా సంతోశ్‌ శ్రీనివాస్ ఓ కథను సిద్ధం చేసుకున్నారట. ఇటీవ‌ల ఆ క‌థ‌ను బాల‌య్య‌కు ఆయ‌న‌కు న‌చ్చేసింద‌ట‌. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలోకి దిగితే’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట‌. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపై మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో బాలకృష్ణ సినిమా.. ‘బలరామయ్య బరిలో దిగితే..`!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts