8 న భారత్ బంద్..!?

December 4, 2020 at 7:20 pm

కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ బోర్డర్ లో నిరసన వ్యక్తం చేస్తూ రైతులు డిసెంబర్ 8 వ తారీఖున మంగళవారం నాడు భారత్ బంద్ కు వారు పిలుపునిచ్చారు. ఢిల్లీ కి వచ్చే అన్ని రహదారులను అడ్డుకుంటామని, కేంద్ర తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైవే టోల్ గేట్లను ఆక్రమిస్తూ డిసెంబర్ 8 జరిగే బంద్లో భాగంగా ప్రభుత్వం టోల్ వసూలు చేయడానికి కూడా అనుమతించేది లేదని రైతులు తెలియజేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు చేసే విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని, లేదంటే వాళ్ళు అసలు వెనక్కి తగ్గే సమస్యే లేదంటూ రైతు సంఘాల నాయకులు తేల్చి చెప్పారు.

ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల నిరసన మరింత ఉదృతం చేస్తామంటూ చెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అన్న ఆందోళన అందరిలోనూ వ్యక్తం అవుతుంది. మరో పక్క కేంద్రం వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు ఏ మాత్రం పాజిటివ్ గా కనిపించట్లేదు. రైతులు చట్టాల రద్దుకే ప్రధానంగా బంద్ చెప్పుతారు రైతులు.

8 న భారత్ బంద్..!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts