
ప్రముఖ బాలీవుడ్ నటి, ‘రంగీలా’ ఫేం ఊర్మిళ మతోండ్కర్ తాజాగా కాంగ్రెస్‌కు శాస్వతంగా గుడ్ బై చెప్పేసి.. శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సిఎం, శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఊర్మిళ పార్టీ కండువా కప్పుకున్నారు.
గత కొన్ని రోజులుగా ఊర్మిళ శివసేనలో చేరనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్తలనే నిజం చేస్తూ.. నేడు ఆమె శివసేన గూటికి చేరిపోయారు. సీఎం థాకరే నివాసం మాతోశ్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఊర్మిళను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాగా, 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ.. ఆ పార్టీ తరుపన ముంబై నార్త్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఐదు నెలలకే తనకు తగిన గుర్తింపు లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక అప్పటి నుంచి పాలిటిక్స్‌కు దూరంగా ఉన్న ఊర్మిళ హఠాత్తుగా శివసేనలో చేరింది.