
ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన హాలీవుడ్ యాక్టర్ ఎలేన్ పేజ్ ఒక సంచలన ప్రకటన చేశాడు. తాను ఒక ట్రాన్స్జెండర్నని సోషల్ మీడియా ద్వారా అందరికి వెల్లడించారు. జూనో మూవీలో తన నటనకు గాను ప్రపంచ వ్యాప్తంగా ఫాన్స్ సంపాదించుకున్న ఎలెన్ తాను ట్రాన్స్నని చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ తెలిపాడు. ఈ వార్తను ఇలా అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉందని, ఈ ప్రయాణంలో తనకు అండగా నిలిచిన ట్రాన్స్ కమ్యునిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. ఇప్పటినుంచి తనకు నచ్చిన నట్టు ఉండవచ్చని,ఇలా ఉండటం చాలా గొప్పగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ట్విట్టర్లో ట్రాన్స్ కమ్యూనిటీ ఆరోగ్యంపై పట్టించుకోని రాజకీయ నాయకులపై విమర్శలు వినిపించాయి. ట్రాన్స్జెండర్ పై తమ అసహ్యతను ప్రదర్శించే నాయకుల వల్లే రోజు రోజుకి ట్రాన్స్జెండర్స్ ఆత్మహత్యలు నానాటికి పెరుగుతూ వస్తునయ్యని ఆయన మండిపడ్డారు. తాన్ను ఒక ట్రాన్స్నన్న ఎలెన్ బోల్డ్ స్టేట్మెంట్తో ది అమ్బ్రిల్లా అకాడమీ సిరీస్లో ఆయన నటించే పాత్రలో ఎలాంటి మార్పులు ఉండబోవంతు ఆ యూనిట్ స్పష్టం చేసింది. వన్య హార్గ్రీవ్స్ అనే మహిళ పాత్రలో ఇంతకు ముందులానే ఎలేన్ దీనిలో కూడా నటించనున్నారని ఎలేన్ ట్రాన్స్ స్టేట్మెంట్కు తాము పూర్తిగా గౌరవిస్తున్నామని యూనిట్ పేర్కొంది. ఎలేన్ చేసిన ప్రకటనపై ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రటీలు తమ మద్దతు తెలుపుతున్నారు.