” బొమ్మ అదిరిపోయి దిమ్మ తిరిగింది ” టీజర్ విడుదల…!?

December 2, 2020 at 5:13 pm

త‌న‌ కామెడీతో అంద‌రిని అల‌రించి మెప్పించే ష‌క‌ల‌క శంక‌ర్ హీరోగా న‌టిస్తోన్ మూవీ బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది. రొమాంటిక్ హారర్ కామెడీ ఎంట‌ర్ టైనర్ గా వ‌స్తోన్న ఈ సినిమా టీజ‌ర్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. మూవీ టీజ‌ర్ చాలా ఫ‌న్నీగా, స‌స్పెన్స్ గా సాగుతూ ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకునేలా ఉంది. రాత్రి అది కొట్టిన దెబ్బ‌ల‌కు నాకు బొమ్మ అదిరిపోయి దిమ్మ తిరిగింది అంటూ శంక‌ర్ చెప్పే డైలాగ్స్ చాలా అలరిస్తాయి.

టీజ‌ర్ చూస్తుంటే థియేట‌ర్ కు వ‌చ్చిన ప్రేక్ష‌కుల‌కు ఎంట‌ర్ టైన్ మెంట్ 100 పెర్సెంట్ గారంటీ. ఈ చిత్రానికి కుమార్ కోట ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. టైటిల్ పేరుతోనే మాస్ ఆడియెన్స్ ఇంకా క్లాస్ అడియెన్స్ లో అదిరిపోయే స్పంద‌న తెచ్చుకున్న మూవీ యూనిట్ తాజాగా ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. కుమార్ కోట ఈ చిత్రంతోనే తెలుగు ఇండస్ట్రీ కి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

” బొమ్మ అదిరిపోయి దిమ్మ తిరిగింది ” టీజర్ విడుదల…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts