బిగ్ బాస్ ప్రసార సమయం మార్పులు…!?

December 2, 2020 at 3:38 pm

బిగ్ బాస్ షో దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఫినాలే టిక్కెట్ట్ మాత్రమే మిగిలి ఉంది. అది కూడా ఈ వారంతో ముగుస్తుంది. అయితే షో ముగింపుకు వస్తున్న తరుణంలో టైమింగ్స్‌లో మార్పులు చేయడం చానెల్‌కు ఉన్న అలవాటే. గత సీజన్లలో కూడా అంతే చివరి రెండు మూడు వారాల్లో షో టైం మార్చేశారు. ఎలాగో చివరి దశకు వచ్చింది గనుక ఫాలో అయ్యే వారు అవుతారు అన్న ధీమాతో మార్చేస్తుంటారు. సాధారణంగా కొత్త సీరియల్ ఏదైనా వస్తుంటే పాత వాటి టైమింగ్స్‌లో మార్పులు చేస్తుంటారు.

అందుకే స్టార్ మాలో కొత్తగా రాబోతోన్న ఓ సీరియల్ కోసం బిగ్ బాస్ టైమింగ్స్‌ మారనున్నాయి. ఇకమీదట బిగ్ బాస్ షో మరింత ఆలస్యం కానుంది . బిగ్ బాస్ షో వల్ల సిరిసిరిమువ్వలు, ఆమె కథ సీరియళ్లు బాగా పడి పోయాయి. ప్రతీ రోజూ బిగ్ బాస్ అనంతరం ఆమె కథ సీరియల్ మళ్లీ ప్రసారం అవుతాది. కాబట్టి వచ్చే వారం నుంచి బిగ్ బాస్ షో పది గంటలకు మొదలు కానుంది. శని, ఆది వారాల్లో మళ్లీ యథాతథంగా ఉంటుంది.

బిగ్ బాస్ ప్రసార సమయం మార్పులు…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts