వైరల్ ఫోటో : జాబిల్లి పై డ్రాగన్ జెండా…!?

December 5, 2020 at 6:04 pm

చంద్రుడి మీద తన జాతీయ జెండాను పాతింది చైనా. తాజాగా అందుకు సంబంధించిన పిక్స్ ని డ్రాగన్‌ దేశం రిలీజ్ చేసింది. అమెరికా తర్వాత చంద్రుడి పై జెండాను పాతిన దేశం చైనానే. చాంగే5 ల్యాండర్‌కు ఉన్న కెమెరా ఈ పిక్ తీసింది. సుమారు 50 ఏళ్ల ముందు అత్యంత సంపన్న దేశం అయిన అమెరికా తమ జాతీయ జెండాను చంద్రుడిపై పాతింది. మళ్లీ ఇన్నాళ్లకి చైనా మళ్ళి ఆ పని చేసి చూపించింది. చంద్రుడిపై నమూనాలను సేకరించడానికి వెళ్లిన చైనా స్పేస్‌ షిప్‌ అక్కడ తమ జాతీయ జెండాను పాతింది.

నిశ్చలంగా ఉన్నతమ జెండాను చూసి తెగ మురిసిపోతుంది చైనా. రెండు మీటర్ల వెడల్పు, 90 సెంటిమీటర్ల పొడవు ఉన్న ఈ జెండా పిక్స్ తాజాగా చైనా జాతీయ అంతరిక్ష కేంద్రం విడుదల చేసింది. మూన్ నుండి మట్టిని తీసుకుని తిరిగి భూమ్మీదకు వచ్చే ముందు చాంగే-5 చైనా జెండాను చంద్రుడిపై పాతింది. 2030 నాటికి అంగారక గ్రహం నుంచి కూడా మట్టిని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది చైనా.

వైరల్ ఫోటో : జాబిల్లి పై డ్రాగన్ జెండా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts