చిరంజీవి లేకుండానే ఆచార్య షూటింగ్.. అయోమయంలో ఫ్యాన్స్..?

December 1, 2020 at 6:00 pm

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య అనే సినిమా తెరకెక్కుతుంది అనే విషయం తెలిసిందే. మెసేజ్ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటికి వచ్చిన అది క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

అయితే డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఈ సినిమా షూటింగులో కాజల్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉందని.. అయితే అప్పుడు చిరంజీవి లేకుండానే కాజల్ పై ఉన్న కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు అన్న టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా వేదాళం తెలుగు రీమేక్ కూడా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఇక ఈ సినిమాలో కూడా చిరంజీవి లేకుండా ఉండే పలు కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి లేకుండానే ఆచార్య షూటింగ్.. అయోమయంలో ఫ్యాన్స్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts