సినీ ప్రేక్షకులకు శుభవార్త చెప్పిన ఏఎంబి సినిమాస్..?

December 1, 2020 at 3:15 pm

కరోనా వైరస్ కారణంగా మూతపడిన సినిమా హాళ్లు ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ సినిమా హాళ్లు తెరుచుకోవాలి అనుకున్నప్పటికీ ప్రస్తుతం విడుదలయ్యే సినిమాలు కూడా ఏవీ లేకపోవడం అంతేకాకుండా 50 శాతం సీట్లు తోనే సినిమా హాల్లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో సినిమా హాళ్లు తెరిచేందుకు నిర్వాహకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో థియేటర్ మజా ని ప్రేక్షకులు మిస్సై దాదాపు తొమ్మిది నెలలు గడిచి పోతుంది అని చెప్పాలి.

ఎప్పుడెప్పుడు సినిమా థియేటర్ లు ఓపెన్ అవుతాయా సినిమా థియేటర్లో సినిమా చూస్తామా అని అటు సినీ ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవలే ప్రస్తుతం సినిమా థియేటర్ లు ఓపెన్ చేయడానికి ఇదే సరైన సమయం అంటూ ఒక పోస్టర్ను విడుదల చేస్తూ సినీ ప్రేక్షకులలో ఎంతగానో ఉత్సాహాన్ని నింపింది ఏ ఎం బి సినిమాస్. డిసెంబర్ 4 నుంచి తమ మల్టీప్లెక్స్ తెరవబోతున్నట్లు ప్రకటించి ప్రేక్షకులందరినీ ఆకర్షించేందుకు సిద్ధమైంది.

సినీ ప్రేక్షకులకు శుభవార్త చెప్పిన ఏఎంబి సినిమాస్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts