నాగార్జున‌ దెబ్బ‌కు దూర‌మ‌వుతున్న‌ ఆ ఇద్ద‌రు!

December 4, 2020 at 9:37 am

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజ‌న్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే షోను బిగ్ బాస్ నిర్వాహ‌కులు రంజుగా మార్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ హైస్‌లో ఏ రోజు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కాదు. ఇన్నాళ్లు కలిసి ఉన్న వారు విడిపోతున్నారు. విడి విడిగా ఉండే వారు కాలుస్తున్నారు. ఇక మొద‌టి వారం నుంచి చాలా క్లోజ్‌గా ఉంటూ వ‌చ్చిన అభిజిత్- హారిక‌ల దూరం ప్రారంభం అయింది.

ఈ దూరం రావ‌డానికి హోస్ట్ నాగార్జునే కార‌ణం అని చెప్పాలి. ఎందుకంటే, గ‌త వీకెండ్‌లో హారిక‌ను కన్‌ఫెషన్ రూమ్‌లోకి ఓ రేంజ్‌లో క్లాస్ పీకారు. ముఖ్యంగా అభిజిత్‌పై ఫేవరటిజం చూపుతున్నావ‌ని, మ‌రియు అత‌డు బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసినా ఆప‌డం లేదంటూ హారిక‌పై నాగ్ కాస్త ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే హారిక త‌న ఆట‌తీరు మార్చుకుంటాన‌ని తెలిపింది. ఇక అప్ప‌టి నుంచి అభిజిత్‌కు హారిక దూర‌మ‌వుతూ వ‌చ్చింది.

అలాగే 13వ వారం ఏకంగా అభిజిత్ నామినేట్ చేసి.. అంద‌రికీ షాక్ ఇచ్చింది హారిక‌. ఇక నిన్న‌టి ఎపిసోడ్‌లో అభి, హారిక‌ల మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింది. అభి తన సమస్య ఏదో చెప్పుకోడానికి ఇంగ్లీష్‌లో ప్రయత్నిస్తుంటే.. హారిక తెలుగులో మాట్లాడాలి అని మినిమమ్ రూల్ చెప్పింది. దీంతో చిర్రెత్తిన అభి.. నువ్వు నాతో మాట్లాడాలంటే ఇంకో ఐదు సంవ‌త్స‌రాలు ఎద‌గాలి.. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదు..తన బాధ వినిపించుకోవట్లేదు అని మండిప‌డ్డాడు. ఇక ఆ త‌ర్వాత హారిక‌నే సారి చెప్పినా.. అభిజిత్ ప‌ట్టించుకోలేదు. దాంతో హారిక కూడా అత‌డిని ప‌ట్టించుకోవ‌డం మానేసింది.

నాగార్జున‌ దెబ్బ‌కు దూర‌మ‌వుతున్న‌ ఆ ఇద్ద‌రు!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts