కరోనా విలయం.. 24 గంటల్లో 2 లక్షల పైగా కేసులు..?

December 4, 2020 at 2:32 pm

అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వదలడం లేదు.ఎన్ని నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ అగ్రరాజ్యాన్ని పట్టి పీడిస్తూనే ఉంది మహమ్మారి వైరస్. ఇప్పటికే అన్ని దేశాలలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అమెరికాలో మాత్రం రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇక ప్రతి రోజు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదు అవుతున్న తరుణంలో ప్రస్తుతం అమెరికా ప్రజలందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు. గత 24 గంటల్లో మరోసారి రికార్డు స్థాయిలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. 24 గంటల్లో 2.10 లక్షలకుపైగా కొత్త కేసులు నమోదైనట్లు జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది.

అమెరికాలో మొదటి కరోనా వైరస్ కేసు వెలుగులోకి వచ్చిన నాటి నుంచి కూడా… ఇలా 24 గంటల్లో ఎంత రేంజిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి అంటూ చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు. దీంతో ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ బారిన పడిన బాధితుల సంఖ్య 1.41 కోట్లు దాటిపోయింది. ఒకేరోజు 2907 మంది వైరస్ బారిన పడి మరణించడం అందరిని ఆందోళన కలిగిస్తోంది.

కరోనా విలయం.. 24 గంటల్లో 2 లక్షల పైగా కేసులు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts