తెలంగాణ‌లో క్ర‌మంగా అంతం అవుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!

December 4, 2020 at 9:44 am

అతిసూక్ష్మ‌జీవి అయిన‌ క‌రోనా వైర‌స్‌.. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని దేశాల‌కు పాకేసి ప్ర‌జ‌ల‌ను ముప్ప తిప్ప‌డు పెడుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కొన్ని లక్షల మందికి పైగా ఈ వ్యాధి సోకింది. ప్ర‌పంచ‌దేశాల‌కు శ‌త్రువుగా మారిన‌ ఈ క‌రోనా మ‌హ‌మ్మారి.. ఎప్పుడు అంతం అవుతుందో అని ప్ర‌జ‌లు వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో నిన్న‌ క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య మ‌రింత‌ త‌గ్గాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 631 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 2,72,123 కి చేరింది. ఇక నిన్న ఇద్ద‌రు క‌రోనా కారణంగా మరణించగా, మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 1,467 కు పెరిగిందని వెల్లడించింది.

అలాగే కొత్తగా రికవరీ అయిన వారి సంఖ్య 802 నమోదు కాగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 2,61,830 కి చేరుకుంది. ప్ర‌స్తుతం తెలంగాణలో ఇప్పుడు యాక్టివ్ కేసులు 8,826 ఉన్నాయి. కాగా, క‌రోనా పాజిటివ్ కేసుల కంటే రిక‌వ‌రీ కేసులు ఎక్కువ‌గా ఉండ‌టం కాస్త ఊర‌ట‌నిచ్చే అంశంగా చెప్పుకోవ‌చ్చు. ఇక నిన్న ఒక్క‌రోజే 57,405 టెస్టులు చేశారు అధికారులు. ఇక ఇప్పటి వరకు కరోనా టెస్టుల సంఖ్య 56,62,711 కి చేరింది.

తెలంగాణ‌లో క్ర‌మంగా అంతం అవుతున్న క‌రోనా.. తాజా లెక్క ఇదే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts