విదేశీ ఫైటర్స్ కోసం..డిలే కానున్న ఫైటర్ మూవీ!!

December 5, 2020 at 6:45 pm

కరోనా కారణంగా ఎన్నోచిత్రాల షూటింగ్ లు నిలిచిపోయాయి. ప్రస్తుతం మరలా ప్రముఖ హీరోలందరూ షూటింగ్స్ కి రెడీ అవుతున్నారు. కానీ కరోనా ముందే మొదలయిన పైటర్ మూవీ ఆచూకీ మాత్రం అసలు వినిపించడం లేదు. ప్రముఖ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు.ఫైటర్ సినిమా మార్చిలో కరోనా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్ ను ఇంకా పునఃప్రారంభించక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం అవ్వబోతుందని వార్తలు వచ్చాయి కానీ ఇప్పటి వరుకు మొదలయిన దాఖలు లేవు. మరలా జనవరి రెండవ వారం నుండి ఫైటర్ సినిమా పునః ప్రారంభం అవుతుందని టాక్. ఫైటర్ మూవీ షూటింగ్ కోసం విదేశీ ఫైటర్స్ కావాల్సి ఉంది కానీ కరోనా పరిస్థితుల కారణంగా వారు రాలేక షూటింగ్ వాయిదా పడిందని వినికిడి. దీనివల్లనే ఫైటర్ మూవీ ఇంత ఆలస్యం అవుతుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్తున్నారు.

విదేశీ ఫైటర్స్ కోసం..డిలే కానున్న ఫైటర్ మూవీ!!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts