కారు జోరు.. బోరబండలో డిప్యూటీ మేయర్ ఘ‌న విజయం!

December 4, 2020 at 3:26 pm

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్‌ హోరాహోరీగా కొనసాగుతోంది. పలుచోట్ల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్న వారు సంబరాలు ప్రారంభించారు. కొంతమంది విజయం సాధించి.. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్‌లో మొదట పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో సత్తా చూపిన బీజేపీ.. ఆ తర్వాత ఒక్కసారిగా ఢీలా ప‌డింది.

ఇదే స‌మ‌యంలో కారు దూసుకొచ్చి.. ఇంకా జోరు చూపిస్తోంది. అయితే తాజాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ డివిజన్ లో డిప్యూటీ మేయర్, టీఆర్ఎస్ నేత బాబా ఫసియుద్దీన్ విజయం సాధించారు. ఫసియుద్దీన్ గెలుపుతో బోరబండ టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.

కాగా, గత ఎన్నికల్లో కూడా ఇదే నియోజకవర్గం నుంచి ఫసియుద్దీన్ పోటీ చేసి ఘన విజయం సాధించి డిప్యూటీ మేయర్‌ పదవి దక్కించుకున్నారు. అయితే గత ఎన్నికలతో పోలిస్తే ఇంకా ఎక్కువే మెజార్టీతో ఈ సారి గెలుపొందినట్లు తెలుస్తోంది. కానీ, మెజార్టీ ఎంత అనే విషయం ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. మ‌రోవైపు తాజా సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండ‌గా.. 3 డివిజన్లలో విజయం సాధించింది.

కారు జోరు.. బోరబండలో డిప్యూటీ మేయర్ ఘ‌న విజయం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts