ఎగిరే కప్పను ఎప్పుడైనా చూసారా…!?

December 30, 2020 at 2:40 pm

దక్షిణ ఆసియాలో చాలా అరుదుగా కనిపించే ఎల్లో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్‌ అదే ఎగిరే కప్ప ఇప్పుడు కడపలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో దర్శనం ఇచ్చింది. ఈ ‌ ఫ్రాగ్‌ శాస్త్రీయ పేరు పాలీపెడటస్‌ మాక్యులటస్‌. తెలుగులో ఎగిరే కప్ప అంటారని యోవేవి బొటానికల్‌ గార్డెన్‌ ప్రముఖ డాక్టర్‌ మధుసూదన్ ‌రెడ్డి తెలిపారు. దీని చర్మం అనేక రకాల విధులు నిర్వహిస్తుందని, పొత్తికడుపు పై ఉన్న సన్నని చర్మం ద్వారా ఇవి నీటిని గ్రహిస్తాయన్నారు. దీన్నే పెల్విక్‌ పాచ్‌ అని పిలుస్తారని చెప్పారు.

ఈ కప్పలు ఊపిరితిత్తుల ద్వారా గాలి తీసుకుని కార్బన్‌డైఆక్సైడ్‌ను చర్మం ద్వారా విడుదల చేస్తాయి. మొక్కలకు హాని చేసే క్రిమి కీటకాలను తింటూ పర్యావరణ హితంగా మొక్కల సంరక్షణలో తమ వంతు సహాయం చేస్తున్నాయి అని చెప్పారు. దీన్ని 1830లో జాన్‌ ఎడ్వర్డ్‌ గ్రే కనుగొన్నట్లు తెలిపారు.

ఎగిరే కప్పను ఎప్పుడైనా చూసారా…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts