పెరుగు గురించి ఆశక్తికరమైన విషయాలు మీకోసం…!

December 4, 2020 at 7:44 pm

పెరుగు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పెరుగు తినటం వల్ల అరుగుదలకి ఎక్కువ టైం తీసుకుంటున్నప్పటికీ శరీరంలో బలం పెరగడానికి బాగా దోహద పడుతుంది. పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి, తీసుకున్న ఆహారాన్ని తొందరగా అరిగించుకునేలా చేస్తుంది. దీని వల్ల శరీర సామర్థ్యం కూడా పెరుగుతుంది. పెరుగు గురించి చాలా మందికి తెలియని అనేక విశేషాలు ఉన్నాయి. పెరుగును అసలు వేడి చేయకూడదు. అలా చెయ్యటం వల్ల అది దాని గుణం కోల్పోతుంది.

ఒబెసిటీ ఉన్న వాళ్లు పెరుగు బదులు మజ్జిగ సేవించచ్చు.పెరుగును రాత్రి సమయంలో తినడం అంత మంచిది కాదు. పెరుగును వేరే పండ్లతో కలిపి తీసుకోకూడదు. ఇలా చేయటం వల్ల బాడీలో మెటబాలిజం సమస్యలు తలెత్తవచ్చు. చికెన్, మటన్, చేపలు వండేటప్పుడు దానిలో పెరుగు వేయకూడదు. మాంసాహారం తిన్నాక చివరలో పెరుగు తినటం వల్ల శరీరంలో టాక్సిన్లు విడుదల అవుతాయి. చాలా మంది పెరుగును ఇష్టం వచ్చినట్లు నచ్చినంత తినేస్తుంటారు. పెరుగు మంచిదే కానీ, ఎక్కువ మోతాదులో తింటే ప్రమాదం కూడా .

పెరుగు గురించి ఆశక్తికరమైన విషయాలు మీకోసం…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts