ఆ విషయంలో మహేష్ కు సాటి ఎవరు లేరు అంటున్న ఫ్యాన్స్…!?

December 8, 2020 at 5:35 pm

మహేష్ బాబు దూకుడుకు ఎవ్వరు సాటిరాలేరు అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. 2020లో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ పేరుకు తగ్గట్టుగానే అన్ని ఏరియాల్లో బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టింది. మహేష్ బాబు నటనతో చిత్రాన్ని నిలబెట్టాడు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 143 కోట్ల వసూళు చేసింది. ఇక ఓవర్సీస్‌ మార్కెట్‌లో సరిలేరు నీకెవ్వరు చిత్రం 2 మిలియన్ డాలర్స్‌ను వసూళు చేసి సరికొత్త రికార్డు చేసింది.

ఈ సంగతి పక్కన పెడితే, ఈ మూవీ టాలీవుడ్‌లో ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన చిత్రంగా సరిలేరు నీకెవ్వరు రికార్డు కి ఎక్కింది. అలాగే 2019లో మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా కూడా ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన చిత్రంగా నిలిచింది. దానికి ముందు చేసిన భరత్ అను నేను చిత్రం కూడా అత్యధిక మంది ఈ సినిమాను ట్వీట్ చేస్తూ ట్యాగ్ చేసిన సినిమాగా రికార్డు సాధించింది.

ఆ విషయంలో మహేష్ కు సాటి ఎవరు లేరు అంటున్న ఫ్యాన్స్…!?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts