ఫాన్స్ సిద్ధంకండి.. బంగార్రాజు రాబోతున్నాడు..?

December 1, 2020 at 3:19 pm

టాలీవుడ్ మన్మధుడు నాగార్జున హీరోగా రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన ఎంత మంచి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇక ఈ సినిమాలో బంగార్రాజు పాత్ర అయితే ఎంతగానో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది అన్న విషయం తెలిసిందే ఈ సినిమా తర్వాత బంగార్రాజు అనే పాత్ర పేరునే టైటిల్గా పెట్టుకొని ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు నాగార్జున.

కానీ నాగార్జున హీరోగా తెరకెక్కిన… మన్మధుడు 2 సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ కావడంతో బంగార్రాజు సినిమా ని పక్కకు పెట్టేశారు. ఇక ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బంగార్రాజు అనే సినిమాను కూడా పట్టా లెక్కించేందుకు ప్రస్తుతం నాగార్జున సిద్ధం అయినట్లు తెలుస్తోంది. కళ్యాణ్ కృష్ణ ఇటీవల నాగార్జునకు దీనికి సంబంధించిన పూర్తి స్క్రిప్టు వినిపించగా ఓకే చెప్పినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది.

ఫాన్స్ సిద్ధంకండి.. బంగార్రాజు రాబోతున్నాడు..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts