గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు: తొలి రౌండ్ కారు‌దే!

December 4, 2020 at 11:56 am

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేటి ఉద‌యం నుంచి జోరుగా కొన‌సాగుతున్నాయి. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. మొత్తం 150 డివిజన్లలో 1926 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. వీటిలో అత్యధికంగా బీజేపీకే దక్కాయి. అయితే తాజాగా తొలి రౌండ్ ఫ‌లితాలు విడుద‌ల కాగా.. ఇక్క‌డ కారు జోరు చూపించింది.

పటాన్ చెరువు, ఆర్‌సీపురం, ఛందానగర్, హైదర్ నగర్, జూబ్లీ హిల్స్, ఖైరతాబాద్, ఓల్డ్ బోయిన్ పల్లి, హఫీజ్ పేట్, బాలా నగర్‌ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యంలో నిలిచింది. ఇందులో పటాన్ చెరువు గత ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం గమనార్హం.

మరికాసేపట్లోనే మెహదీపట్నం డివిజన్‌కు సంబంధించిన తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఇక బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో దూసుకెళ్లిన బీజేపీ అదే ఊపును తొలి ఫలితం వరకూ కంటిన్యూ చేయలేకపోవ‌డంతో.. కారు దూసుకువ‌చ్చింది.

గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు: తొలి రౌండ్ కారు‌దే!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts